Tuesday 11 October 2016

ABOUT ME


1963లో ఏర్ప‌డిన గొల్ల‌న‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్తు హైస్కూలుకు 2013కు 50 సంవ‌త్స‌రాలు నిండాయి. ఈ 50 ఏళ్ల‌లో క‌నీసం 10 వేల మంది చ‌దువుకున్నారు. కానీ ఈ హైస్కూలుకు స్వ‌ర్ణోత్స‌వం జ‌ర‌గ‌లేదు. ఎంతోమందికి విద్యా బిక్ష పెట్టి ఎంద‌రి జీవితాలనో ఉన్న‌త స్థితికి తీసుకువెళ్లిన ఈ హైస్కూలుకు పట్టిన దుర్గ‌తి ఇది. కొంత‌మంది పూర్వ విద్యార్దులు స్వ‌ర్ణోత్స‌వం చేయాల‌ని సంక‌ల్పించినా గ్రామ‌పెద్ద‌ల రాజ‌కీయాల వ‌ల్ల సాధ్యం కాలేదు. స్వ‌ర్ణోత్స‌వం క‌న్నా ముందు హైస్కూల్లో వ‌స‌తులు క‌ల్పిస్తే అది స్వ‌ర్ణోత్స‌వం చేసినంత ఘ‌న‌త అనుకున్నారు ఆ పూర్వ విద్యార్థులు. అనుకున్న‌దే త‌డ‌వుగా పూర్వ విద్వార్థుల స‌మ‌న్వ‌య స‌మ‌తి ఏర్పాటు చేశారు. స‌మితి గ‌త నాలుగేళ్లుగా సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. ఇదే హైస్కూల్లో చ‌దువుకుని పై చ‌దువుల‌కు వెళ్లి.. ఐఎఎస్ ఉత్తీర్ణుడై.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో అత్యున్న‌త అధికారి.. ఎపి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టిటిడి ఈవోగా ఉన్నడాక్ట‌ర్ దొండ‌పాటి సాంబ‌శివ‌రావుగారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ స‌మితి సేవా కార్యక్ర‌మాల‌ను ప్రారంభించింది. ఆయ‌న కూడా సుమారు 70 ల‌క్ష‌ల రూపాయ‌లను ప్ర‌భుత్వం నుంచి మంజూరు చేయించి ఐదెక‌రాల స్కూలు ప్రాంగ‌ణానికి ప్ర‌హ‌రీతోపాటు రెండు భ‌వ‌నాలు (ఎనిమిది త‌ర‌గ‌తి గ‌దులు) మంజూరు చేయించారు. వాటికి కావ‌ల‌సిన ఫ‌ర్నీచ‌రు కూడా ప్ర‌భుత్వం ద్వారా మంజూరు చేయించారు. దీంతో స్కూలుకు భ‌వ‌నాలు హంగులు ఏర్ప‌డ్డాయి. కానీ చిన్న‌చిన్నవ‌స‌తులు అవ‌స‌రమ‌య్యాయి. ఇలాంటివాటిని దాత‌ల నుంచి స్వీక‌రించాల‌ని సాంబ‌శివ‌రావుగారు సూచించ‌డంతో స‌మితి ఆ ప‌ద్ధ‌తిలో ప‌య‌నించ‌డం ప్రారంభించింది. దానిలో భాగంగా  విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైనవి అందించి మంచి విద్యాఫ‌లితాలు రాబ‌ట్టేందుకు కృషి చేయ‌డంతోపాటు.. మౌలిక స‌దుపాయాలు తీర్చే ప‌నిచేప‌ట్టింది.  విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం చేయ‌డానికి ప‌ళ్లేలు, గ్లాసులు, పుస్త‌కాలు అందిస్తూ వ‌స్తోంది. అంతేకాదు.. వేస‌వి కాలం చ‌ల్ల‌టి మంచి నీటి కొర‌త తీర్చేందుకు రూ.25 వేల రూపాయ‌ల‌తో కూల‌ర్ కొనిచ్చింది. 10వ త‌ర‌గ‌తిలో అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు న‌గ‌దు ప్రోత్సాహాల‌ను అందిస్తోంది. 1974_75 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 70 వేల రూపాయ‌లు బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి దానిపై వ‌చ్చే ఏడున్న‌ర వేల రూపాయ‌ల వ‌డ్డీతో ప‌దో త‌ర‌గ‌తిలో టాప‌ర్‌కు 5 వేల రూపాయ‌లు, సెకండ్ టాప‌ర్‌కు 2,500 రూపాయ‌లు గ‌త నాలుగేళ్లుగా అంద‌జేస్తూ వ‌స్తోంది. స‌మితి అధ్య‌క్షుడు వేమూరి నాగ‌విద్యారావు 3 ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చుతో స్కూలులో ర‌క్షిత మంచినీటి ట్యాంకు నిర్మించారు. దీనిని డాక్ట‌ర్ సాంబ‌శివ‌రావుగారే ప్రారంభోత్సవం చేశారు. అలాగే సాంబ‌శివ‌రావుగారి రాక సంద‌ర్భంగా దొండ‌పాటి స‌త్య‌నారాయ‌ణ‌, సుబ్బారావు సోద‌రులు ల‌క్ష రూపాయ‌లు, కంభంపాటి ల‌క్ష్మీనారాయ‌ణ 25 వేల రూపాయ‌లు మొత్తం ల‌క్షా 25 వేల విరాళం ప్ర‌క‌టించారు. ఈ విరాళంతో  సైకిల్ షెడ్ నిర్మించారు. ప్ర‌వాస భార‌తీయుడు చిట్నేని పూర్ణ‌చంద్ర‌రావు కూడా ఎంతో తోడ్ప‌డుతున్నారు. ఇలా గ‌త నాలుగేళ్లుగా నిరంతరం స్కూల్లో సేవా కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కార్యక్ర‌మాల్లో ఎవ‌రైనా భాగ‌స్వాములు కావ‌చ్చు. ఇక్క‌డ చ‌దువుకున్న ప్ర‌తి బ్యాచ్ కూడా ఆ బ్యాచ్ పేరుతో సంఘం పెట్టుకుని సేవా కార్యక్ర‌మాలు కొన‌సాగించవ‌చ్చు. స‌మితి ప్రోత్సాహం మేర‌కు ఏర్ప‌డిన‌దే 1974_75 ప‌దో త‌ర‌గ‌తి పూర్వ‌విద్యార్థుల అసోసియేష‌న్‌. దీని మాదిరిగానే ఇక్క‌డ చ‌దువుకున్న వారంతా అనేక బ్యాచ్‌ల‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సేవా కార్యక్ర‌మాలు నిర్వ‌హించ‌వొచ్చు. 
మా విజ్ఞ‌ప్తి ఏమిటంటే.. 
మ‌న‌కు స్కూలు ఎంతో ఇచ్చింది. అంటే జ్ఞానం.. మంచి జీవితం..ఇచ్చింది.  మ‌న త‌ల్లిలాంటి స్కూలుకు ఏమీ ఇవ్వొద్దా?. ఆలోచించండి!. స్కూలు రుణం తీర్చుకోవ‌డం మ‌న బాధ్య‌త. జీవితంలో స్థిర‌ప‌డి ఎక్క‌డెక్క‌డో నివ‌సిస్తున్న మీరు ఒక‌సారి స్కూలును సంద‌ర్శించండి. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను నెవ‌రువేసుకోండి. స్కూలుకు అవ‌స‌ర‌మైన ఒక చిన్న స‌దుపాయం తీర్చండి. మీ రుణం తీరిపోయిన‌ట్లే!. ఇలాంటి వారితో స‌మ‌న్వ‌యం చేయ‌డానికే ఈ పూర్వ విద్యార్థుల స‌మ‌న్వ‌య స‌మితిని ఏర్పాటు చేశాం. 
మీకు మంచి జీవితం ప్ర‌సాదించిన మీ స్కూలుకు మీరైమైనా చేస్తే అది మీ క‌న్న త‌ల్లికి సేవ చేసిన‌ట్లే! ఆలోచించండి! 
..............................................................................................................................................................

About Gollanapalli


Gollanapalli is a Village in Gannavaram Mandal in Krishna District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 70 KM towards North from District head quarters Machilipatnam. 9 KM from Gannavaram. 303 KM from State capital Hyderabad 

Gollanapalli Pin code is 521101 and postal head office is Gannavaram . 

Kothagudem ( 2 KM ) , Kondapavuluru ( 3 KM ) , Gopavarapugudem ( 4 KM ) , Thotapalli ( 4 KM ) , Veerapanenigudem ( 4 KM ) are the nearby Villages to Gollanapalli. Gollanapalli is surrounded by Gannavaram Mandal towards South , Unguturu Mandal towards South , Vijayawada Rural Mandal towards west , Penamaluru Mandal towards South . 

Vijayawada , Hanuman Junction , Nuzvid , Gudivada are the nearby Cities to Gollanapalli.


Demographics of Gollanapalli

Telugu is the Local Language here. Total population of Gollanapalli is 2753 .Males are 1339 and Females are 1,414 living in 676 Houses. Total area of Gollanapalli is 953 hectares. 

HOW TO REACH Gollanapalli

By Road

Vijayawada is the Nearest Town to Gollanapalli. Vijayawada is 31 km from Gollanapalli. Road connectivity is there from Vijayawada to Gollanapalli.

By Rail

Gannavaram Rail Way Station , Pedda Avutapale Rail Way Station are the very nearby railway stations to Gollanapalli. Also you can consider railway Stations from Near By town Vijayawada. Ramavarappadu Rail Way Station , S Narayanapuram Rail Way Station are the railway Stations near to Vijayawada. You can reach from Vijayawada to Gollanapalli by road after . How ever Vijayawada Jn Rail Way Station is major railway station 23 KM near to Gollanapalli 


By Bus

Gannavaram APSRTC Bus Station , Ramavarapupadu Ring/Vja APSRTC Bus Station , Gunadala APSRTC Bus Station are the nearby by Bus Stations to Gollanapalli .APSRTC runs Number of busses from major cities to here. 


Colleges near Gollanapalli

V.k.r.college
Address :
Paladugu Paravathidevi Coll Engg
Address : Surampalli (vilg) gannavaram (md) vijayawad. Distic

Schools near Gollanapalli

Apswr G Gannavaram
Address : gannavaram (u) , gannavaram , krishna , Andhra Pradesh . PIN- 521286 , Post - Pedavutapalli
Vs St Johns H Buddhavaram
Address : gannavaram (u) , gannavaram , krishna , Andhra Pradesh . PIN- 521101 , Post - Gannavaram
Please..school
Address : surampalle , gannavaram , krishna , Andhra Pradesh . PIN- 521212 , Post - Nunna
Care & Share Hs
Address : buddhavaram , gannavaram , krishna , Andhra Pradesh . PIN- 521101 , Post - Gannavaram